పి ఆర్ సి రిపోర్టును తెప్పించుకొని వెంటనే అమలు చేయాలిపి ఆర్ సి రిపోర్టును తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 July, 2026E69NEWS

పి ఆర్ సి రిపోర్టును తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి

పి ఆర్ సి రిపోర్టును తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఖమ్మంజిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలో సభ్యత్వ క్యాంపైన్లో భాగంగా విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా అడసర్ల పాడు ఉన్నత పాఠశాలలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఆరు డి ఏ లను పెండింగ్లో పెట్టిందని పెండింగ్ డీఏలను తక్షణమే విడుదల చేయాలని, పి ఆర్ సి కమిషన్ నుండి రిపోర్టు తెప్పించుకొని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
అంతేకాక ఉద్యోగుల ఆరోగ్య పథకం విధానంలో కూడా చాలా లోపాలు ఉన్నాయని సమగ్రమైన విధానాన్ని రూపొందించి తక్షణమే అమలు చేయాలని, ట్రీట్మెంట్ పొందే హాస్పిటల్స్ వివరాలు, స్పోజ్ విషయంలో నగదు మినహాయింపు, తదితర విషయాల మీద ఉద్యోగులలో అనేక అనుమానాలు ఉన్నాయని వాటన్నింటినీ తక్షణమే నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పేర్కొనడం జరిగింది.
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పెన్షనర్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నిర్మల కుమారి, చంద్రశేఖర్, ఈశ్వరా చారి , సత్యవతి, మారేశ్వరరావు, ప్రసాద్, రవికుమార్, రామశేషు, నాగమణి, ఉష ,రాధాకృష్ణ వీరాంజనేయ,ప్రసన్నకుమార్, రాధాకృష్ణ, సతీష్ , రాంబాబు, నరేష్,కిషోర్,తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com
One thought on “పి ఆర్ సి రిపోర్టును తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *