సూపరవైజర్ భవాని సేవలకు చిరు సత్కారంసూపరవైజర్ భవాని సేవలకు చిరు సత్కారం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ7 July, 2026E69NEWS

సూపరవైజర్ భవాని సేవలకు చిరు సత్కారం

సూపరవైజర్ భవాని సేవలకు చిరు సత్కారం

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలోని లచ్చన్న గూడెం గ్రామానికి చెందిన కొమ్మి నే పల్లి. భవాని మండల పరిధిలోని వెంకటాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులో 7. వతేది 2018లో సూపర్వైజర్ గా చేరారు. ప్రస్తుతం భవాని దమ్మపేట మండల ప్రాజెక్టుకు ఇటీవల బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బదిలీ కాబడిన సూపర్వైజర్ కొమ్మినేపల్లి. భవానీని బీరపల్లి సెక్టార్ లోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు గ్రామ పెద్దలు శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన సేవలను కొనియాడారు.
ఆమె స్థానంలో ఇజ్జిగాని గంగాజలం విధుల్లో చేరారు. బీరాపల్లి సెక్టార్ నుండి బదిలీ లో భాగంగా దమ్మపేట ప్రాజెక్టుకు బదిలీ అవ్వడం జరిగింది. ప్రతి వారితో కలివిడిగా ఉండి మంచితనాన్ని సంపాదించారు. ప్రతి వారికి ఆహారం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. బడిని మానివేసిన పిల్లలను తిరిగి మరల పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేశారు. గర్భిణీ ఆరోగ్య పరీక్షలు హాస్పటల్ నందు చేర్పించే విషయంలో కృషి చేయడం జరిగిందని భవాని అన్నారు. వియం బంజార గురుదక్షిణ ఫౌండేషన్ వారి నుండి వేంసూర్ మండలానికి మండలానికి ఎల్ఈడి టీవీలు బహుమతిగా ఇచ్చినందున తమ సెక్టార్ పరిధిలో వారికి ఇవ్వడం జరిగింది అన్నారు. మండలానికి ఆ ఎల్ఈడి టీవీలు బహుమతిగా ఇచ్చారని అన్నారు అంగన్వాడి కేంద్రాలకు స్కూల్ లో విద్యకు ఆయా గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో కుర్చీలు పాలకులు, బలపాలు మూడు నుండి 6 సంవత్సరాల పిల్లలకు వితరణంగా ఇచ్చామని అన్నారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో పిల్లలను ఆదుకోవడం జరిగిందన్నారు. గర్భిణీ సామూహిక శ్రీమంతాలు అక్షరాభ్యాసాలు అన్నప్రసనలు సెక్టార్ పరిధిలో చేయించటం జరిగిందన్నారు. గ్రామస్తులతో అంగన్వాడి టీచర్లతో ఆయాలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారితో వర్క్ చేయించడం జరిగిందన్నారు పై అధికారుల ఆదేశాలను బేఖాసరు చేయకుండా కిందిస్థాయి వారికి తెలియజేస్తూ వారి పనిని వారికి కేటాయిస్తూ సకాలంలో పనిని పూర్తి చేయించడం జరిగిందన్నారు ఉద్యోగ బాధ్యతను నిర్వహించడంలో తన వంతు కృషి చేశానని ఈ సందర్భంగా అధికారులకు మండల ప్రజలకు అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు ఆశ వర్కర్లకు పాత్రికేయ సోదరులకు అందరికీ భవానికృతజ్ఞతలు తెలియజేశారు.

About The Author

E69NEWSe69news.com
One thought on “సూపరవైజర్ భవాని సేవలకు చిరు సత్కారం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *