పుర పోరుకు బందోబస్తుకు సిద్ధమైన పోలీస్ యంత్రాంగం
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి డ్యూటీ లో నిర్వహించాల్సిన విధుల గురించి కల్లూరు ఎసిపి వసుంధర యాదవ్,మరియు సత్తుపల్లి ఎస్ హెచ్ ఒ తుమ్మలపల్లి శ్రీహరి వివరించారు.బందోబస్తుకు ఎసిపి-3, సిఐ -3,ఎస్ఐ-12, మరియు 200 మంది పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగిందనీ మీడియాకు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన మరియు జిల్లాలో 163/బిఎన్ఎస్ఎస్ అమలులో ఉన్నందువలన ప్రజలు గుంపులుగా ఉన్నా, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తప్పవని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఎన్నికల విధులలో ఉన్న పోలీస్ సిబ్బంది విధులకు సహకరించాలని సత్తుపల్లి పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేశారు.