పోటు రంగారావు పై కేసు
సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) ఉపా చట్టం కింద కేసు, నోటీసు జారీ చేయడాన్ని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున, తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు ఒక ప్రకటన లో తెలియజేశారు.
పేద ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న నాయకులపై ఇలాంటి దేశద్రోహం తరహా కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న వారిని కేసులు, బెదిరింపులతో అణచివేయాలని ప్రయత్నించడం సరైంది కాదు. ఇది ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్య.
పోటు రంగారావు వంటి ప్రజా నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి కాకుండా, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని నున్నా తన ప్రకటన లో కోరారు.