రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ల గణపతి రెడ్డి
ప్రభుత్వ హామీల అమలుకై పంచాయతీ కార్మికుల సమరం ప్రారంభానికి సిద్ధం
తెలుగు గళం న్యూస్ జనగామ, మే 11
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సమావేశం జనగామ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పైళ్ల గణపతి రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ పాలడుగు భాస్కర్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు.సమావేశం ప్రారంభంలో అమరవీరులకు సంతాపం ప్రకటించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి వెంకటయ్య, కోశాధికారి తునికి మహేష్, సిఐటియు జనగామ జిల్లా కార్యదర్శి విజయేందర్, రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్ట యాదమ్మ, ఉపాధ్యక్షులు వెంకటేష్ గౌడ్, లక్ష్మీనారాయణ, అంజయ్య, దశరథ్, గ్యార పాండు, బండ్ల అప్పిరెడ్డి, పులి మల్లేష్, కార్యదర్శులు రాపర్తి రాజు, బొజ్జ ఆశన్న, కొప్పుల శంకర్, ఎండి. అసిఫ్, శ్రీకాంత్, రాము, శేఖర్ తదితరులతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.సమావేశంలో పంచాయతీ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పంచాయతీ కార్మికులకు కనీస వేతనం కల్పించాలని, ఉద్యోగాలను శాశ్వతీకరించాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భవిష్యత్ కార్యాచరణ: మే 20 నుండి 29 వరకు మండల, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించడం, మే 30న సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో జెండా ఆవిష్కరణతో పాటు గ్రామపంచాయతీ కమిటీలు ఏర్పాటు చేయడం, జూన్ 1న ఎంపీడీవో కార్యాలయాల వద్ద ధర్నాలు, జూన్ 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి, జూన్ 15న మంత్రులు, ఎమ్మెల్యేల కార్యాలయాల ముట్టడి, జూన్ 18న అన్ని కార్మిక సంఘాల సమావేశం, జూన్ 20న నల్గొండలో రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు.పంచాయతీ కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు.