పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్
పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్*
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/జూన్ 5
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ జక్కీ అనిత శ్రీకాంత్ మాట్లాడుతూ…పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలి.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారానే పర్యావరణాన్ని కాపాడగలం.ప్లాస్టిక్ నిర్మూలనతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది.గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలనకు అందరూ కలిసి పాల్గొనాలి.ఘన వ్యర్థాలను తడి చెత్త, పొడి చెత్త,సానిటరీ వ్యర్థాలు, ప్రమాదకరమైన వ్యర్థాలుగా నాలుగు రకాలుగా విభజించి వేరు చేయాలి అని పిలుపునిచ్చారు.అనంతరం మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టి, గ్రామపంచాయతీ ఆవరణంలో మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దేవేందర్, కార్యదర్శి షేక్ హుస్సేన్,వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,మహిళా సంఘాలు,యువకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.