మాజీ టేస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు
తెలుగు గళం న్యూస్ ఐనవోలు/జూన్ 5
ఐనవోలు మండలం నందనం గ్రామంలో బుర్ర రాజ్ కుమార్ తండ్రి కీ.శే. బుర్ర సారయ్య దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ టిస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొని కీ.శే. బుర్ర సారయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓంటిమామిడిపల్లి మాజీ సర్పంచ్ ఆడెపు దయాకర్, చీకటి శ్రీనివాస్,గ్రామ ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.