మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించిన రవి పటేల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న 2026 సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తన సతీమణితో కలిసి ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం రవి పటేల్ మీడియాతో మాట్లాడుతూ,తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున భూపాలపల్లి మున్సిపాలిటీలో పోటీలో నిలిచిన ఐదుగురు అభ్యర్థులకు అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో డబ్బు, మద్యం ప్రభావం ఉన్నప్పటికీ, తమ పార్టీ అభ్యర్థులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారని అన్నారు.నిస్వార్థంగా ప్రజల సమస్యలను ముందుకు తెచ్చి పోరాడిన అభ్యర్థులు ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు.భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ చివరి నిమిషం వరకు కృషి చేసిన తమ పార్టీ అభ్యర్థులు పార్టీకి గర్వకారణమని తెలిపారు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆదేశాల మేరకు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆశీస్సులతో భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా ప్రచారం కొనసాగించిన అభ్యర్థులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.అధికార,ప్రతిపక్ష పార్టీల ద్వారా జరుగుతున్న డబ్బు, మద్యం ప్రభావాన్ని ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.ప్రజలు చైతన్యంతో,ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.భవిష్యత్ రాజకీయాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని రవి పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు.