జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో మేడారంలో సహాయక చర్యలు ముమ్మరం
జేసీబీతో రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించిన మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి
మంత్రి సీతక్క ఆదేశాలు – జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో మేడారంలో సహాయక చర్యలు ముమ్మరం
భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి – వాతావరణ పరిస్థితులు గమనించి మేడారం రావాలని విజ్ఞప్తి
తెలుగు గళం తాడ్వాయి, ములుగు :
మేడారంలో భక్తుల రాకపోకలకు అంతరాయం లేకుండా వెంటనే సహాయక చర్యలు
జేసీబీ సాయంతో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించిన ములుగు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచి, సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం స్థానిక జేసీబీ యంత్రాన్ని వినియోగించి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించి భక్తులు, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రేగ కల్యాణి మాట్లాడుతూ, రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాలు చేయాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. భక్తుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, అవసరమైన అన్ని సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్, ఇర్ప సునీల్ దొర, మేడారం సర్పంచ్ పిరిల భారతి వెంకన్న, సీనియర్ నాయకులు పులి సంపత్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా