లేబర్ కోడ్లు … కార్మికుల మెడలకు ఉరితాళ్ళు
- ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సంబంధించి జయప్రదం చేయండి:(సిఐటియు ఖమ్మంజిల్లా కోశాధికారి
చలమాల విఠల్ రావు - సత్తుపల్లి నియోజవర్గ పరిధిలోని పెనుబల్లి మండల పరిధిలోని వి.ఏం.బంజర గ్రామంలోని చలమాల సూర్యనారాయణ భవనంలో వామపక్షాలు, కార్మిక సంఘాల సంయుక్త సమావేశం మంగళవారం తాండ్ర రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు ఖమ్మంజిల్లా కోశాధికారి చలమాల విఠల్ రావు పాల్గొని, మాట్లాడుతూ, కార్మిక మెడలకు ఉరితాడు బిగించే లేబర్ కోళ్లు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటుందని, కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ఎండీఏ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అలాగే మన దేశం నుంచి తరలి వెళ్లిన సిస్ బ్యాంకు లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి,ప్రతి మహిళకు 15 లక్షల ఇస్తామని,నిత్యవసర వస్తువులు తగ్గిస్తామని, అలాగే ప్రభుత్వ రంగం బలోపేతం చేస్తామని హామీ ఇచ్చి, ఒక్కొక్క హామీ అమలు చేయకుండా కార్పొరేట్ వ్యవసాయం తీసుకువచ్చి రైతాంగాన్ని రోడ్లమీద పడవేసి, కుట్రలు చేస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా విబిజి రాంజీ పథకం తీసుకొచ్చారని దీనివల్ల వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ హక్కు పని హక్కుని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం( ఎమ్మెల్ మాస్ లైన్ ) జిల్లా నాయకులు బీరెల్లి లాజరు మాట్లాడుతూ, రైతాంగానే దెబ్బతీస్తే విత్తన సంస్కరణ బిల్లు విద్యుత్ సంస్కరణ బిల్లు తీసుకురావడంని అందరూ ఖండిస్తూ ఫిబ్రవరి 14న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిఐటియు ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికవర్గాన్ని, రైతులను,వ్యవసాయ కూలీలను,దగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణ బిల్లులను అందరూ వ్యతిరేకించాలని, కార్మికుల శ్రమదోపిడీని పెట్టుబడిదారీ కార్పోరేటర్లకు దోశ పెడుతున్న బిజెపి విధానాలను ఎండగట్టాలని ఆయన అన్నారు. జిల్లా పౌర హక్కుల సంఘం నాయకులు కాటినేని శ్రీనివాసరావు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు చిట్టి మొదల కృష్ణ నల్లమల్ల అరుణ్ ప్రతాప్, మండల ఉపాధ్యక్షులు చలమాల నరసింహారావు, మహిళా సంఘం మండల కార్యదర్శి మిట్టపల్లి నాగమణి, ప్రజానాట్యమండలి డివిజన్ అధ్యక్షుడు కంటే సత్యం, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు బుక్కే ప్రసాదు, కలకోట అప్పారావు, హమాలీ యూనియన్ అనప రెడ్డి,గుజ్జ వెంకటేశ్వర్లు,మిద్దె స్వామి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కొప్పుల గోవిందరావు, బుడ్డియ్య, దేశిని. వెంకటేశ్వరరావు, వి. రవీంద్ర,చంద్రశేఖర్, దొంతు మాధవ, మంగయ్య, నాగేశ్వరరావు, మేకల బాజీ, తదితరులు పాల్గొని ఫిబ్రవరి జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ప్రదర్శనకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు