వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సర్పంచ్
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం తురకల సోమవారం గ్రామంలో వెన్నెల గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.స్థానిక సర్పంచ్ ఏర్పుల శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఏపీఎం రాజీర్తో కలిసి కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాల ప్రకారం రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనల ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.అని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొనుగోలులో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగవంతంగా కాంటాలు జరిపించాలి.కొనుగోలు కేంద్రంలో రాత్రి సమయాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గ్రామపంచాయతీ తరపున లైటింగ్ ఏర్పాట్లతో పాటు మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తాను.ధాన్యం క్రయవిక్రయాలలో సమస్యలు రాకుండా రైతులు,హమాలీలు, నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలి,అని ఈ సందర్భంగా అన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పర్వతగిరి, నెక్కొండ ఏపీఎంలు రాజీర్, కిరణ్, స్త్రీ నిధి ఆర్ఎం సైదిరెడ్డి, కొంకపాక క్లస్టర్ కోఆర్డినేటర్ గోలి కొమురయ్య, గోరు గుట్ట తండా మాజీ సర్పంచ్ బానోతు వెంకన్న, సోమవారం గోరు గుట్ట తండా వార్డు సభ్యులు, వివో అధ్యక్షురాలు రజిత, సెంటర్ ఇంచార్జ్ భైరవోయిన జ్యోతి, హమాలీలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.