విద్యార్థులతో స్నేహితునిలా ఆ అధికారి
క్రమశిక్షణకు మారుపేరు గా ఆ వసతి గృహ అధికారి ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల వెన్నచేడు వెంకటాపురం గ్రామంలో గల ప్రభుత్వ బిసి బాలుర వసతి గృహ సంక్షేమ అధికారి కృష్ణకిరణ్ అనునిత్యం వసతి గృహం విద్యార్థులతో స్నేహితునిలా కలసి మెలసి ఉంటారు.విద్యార్థులతో కలిసి భోజనం చేయడం ఆయనలో ఉన్న ప్రత్యేకత.
అలా ఉంటూ వసతి గృహంపై మక్కువ కలిగేలా వారి దృష్టి చదువు పై సారించేలా అవిశ్రాంత కృషి చేస్తూ ఉత్తమ సంక్షేమ అధికారిగా విద్యార్థుల తల్లితండ్రుల,గ్రామ పెద్దల మన్ననలు పొందుతున్నారు.
విద్యార్థులతో వ్యాయామం చేయించడం,క్విజ్ పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తున్నారు.రాత్రి సమయంలో విద్యార్థులతో 11 గంటల వరకు ఉంటూ తన బాధ్యత ను చాటుతున్నారు.ఓ తండ్రిలా విద్యార్థులను ప్రేమతో దండించకుండా క్రమశిక్షణగా మెలిగేలా ఆలోచన చేస్తూ నిరంతరం పని చేస్తున్నారు.
మెనూ ప్రకారం ఆహారం అందిస్తూ,పరిశుభ్రతపై అవగాహన పెంచుతూ,ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా నిరంతరం ఆశా వర్కర్స్,ఏఎన్ఎం లతో వైద్య క్యాంపులు ఏర్పాటు చేయిస్తూ పరీక్షలు చేయిస్తూ ఆరోగ్య విద్యార్థులుగా తీర్చి దిద్దడానికి చేస్తున్న కృషి బలా భేష్.బిసి బాలుర వసతి గృహ విద్యార్థులు పాఠశాలలో మెరుగైన ర్యాంకులు తెచ్చేలా ఉండేలా ట్యూషన్ చెబుతూ వారి బంగారు భవిష్యత్ కు కిరణ్ బాటలు వేస్తున్నారు