సత్తుపల్లి ఏరియా ఇతర అధికారులు సమీక్షా సమావేశం
ఖమ్మంజిల్లా సత్తుపల్లి లో కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన ఒక్క రోజు సమ్మెకు సంబంధించి జి.ఎం కార్యాలయంలో తేదీ 10.02.2026 న అన్ని యూనియన్ల ప్రతినిధులతో ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మరియు సత్తుపల్లి ఏరియా ఇతర అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12 వ తేదీన తలపెట్టిన ఒక్క రోజు సమ్మెకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విధులకు హాజరు అయ్యి – లక్ష్య సాధనలో సహకరించాలని కోరారు.కొన్ని కార్మిక సంఘాలు, సింగరేణి కార్మికులు కూడా దీనిలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ సమ్మె డిమాండ్లలో అత్యధికం సింగరేణి కార్మికులకు మాత్రమే సంబంధించినవి కావు,
వివిధ కారణాల వలన ఈ ఆర్థిక సంవత్సరం, నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి మరియు ఓవర్ బర్డెన్ తొలగింపులో కొంత వెనుకబడి ఉన్నాము. ఈ సమయంలో, లక్ష్యసాధనకు ప్రతీ రోజు సాధించే ఉత్పత్తి కూడా ఎంతో తోడ్పాటునందిస్తుంది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరగడానికి మనం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించి, రవాణా చేస్తూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తు చేశారు.మనం ఒక్కరోజు సమ్మె చేస్తే…
కంపెనీకి కలిగే ఉత్పత్తి నష్టం విలువ – సుమారు రూ.77 కోట్లు
కార్మికులు కోల్పోయే వేతనాలు -సుమారు రూ.12 కోట్లు
ఒక్క రోజు ఉత్పత్తి నష్టం –2.20 లక్షల టన్నులు గత ఆర్థిక సంవత్సరం 2024-25లో 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 65.27 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా జరిగినది. లాభాల బోనస్, పిఎల్ఆర్ బోనస్లు ఉద్యోగులకు చెల్లించడం జరిగినది. వివిధ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయడం జరుగుతున్నది అని విజ్ఞప్తి చేశారు.ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు మనం సుమారు 49 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాం. మిగిలిన 23 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్య సాధనకై ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలలు ప్రతీ రోజు శ్రమించాల్సి ఉంది.కనుక ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన సమ్మెకు దూరంగా ఉండి, విధులు నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.ఈ సభకు సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఎస్ ఓ టు జి ఎం బొల్లం శ్రీనివాసు,ప్రాజెక్టు ఆఫీసర్లు జె వి ఆర్ ఒ సి , ఎన్ వీ ఆర్ ప్రహ్లాద్, కిష్టారం ఓసీ ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ, ఏరియా ఇంజినీర్ కే సోమశేఖర్, కాలరీ మేనేజర్లు జె వి ఆర్ ఒ సి , బి రాజేశ్వరరావు, కిష్టారం ఒ సి రామకృష్ణ, సంక్షేమ అధికారులు కావ్య, శ్రీనివాస్, సత్తుపల్లి ఏరియా జె వి ఆర్ ఒ సి , జె వి ఆర్ సి హెచ్ పి కిష్టారంఓసీ యొక్క గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘం, మరియు ఇతర యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.