సాయుధ పోరాట యోధురాలు గండ్లూరి మరణం
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ గండ్లూరి కిషన్ రావు గారి సతీమణి కామ్రేడ్ గండ్లూరి నర్సుబాయమ్మ (80 సం. లు) ఎర్రజెండా నీడలో నిలిచిన ధైర్యమూర్తి
కష్టజీవుల గుండెల్లో వెలిగిన స్ఫూర్తి పోరాట సహచరిగా జీవితాన్ని అర్పించిన కామ్రేడ్ గండ్లూరి నర్సుబాయమ్మ సోమవారం ఉదయం ఖమ్మం లో వారి స్వగృహంలో మరణించారు.వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ గండ్లూరి కిషన్ రావు గారి సతీమణి శ్రీమతి గండ్లూరి నర్సుబాయమ్మ ఆమె పార్థివదేహం సందర్శనార్ధం వారి స్వగృహం మామిళ్ళగూడెం, తెలంగాణ గ్రామీణ బ్యాంకు దగ్గర, ఖమ్మంలో ఉంచారు. ఎందరో వామపక్ష వాదులు సందర్శించి నివాళులు అర్పించారు.