
సిరిమల్ల జగన్నాథం 28 వర్ధంతి కార్యక్రమంలో-నాయిని
రామన్నపేటలో 29 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టేడ్ కార్పొరేటర్ సిరిమల్ల చెన్నమల్లు తండ్రి సిరిమల్ల జగన్నాథం 28 వ వర్ధంతిని పురస్కరించుకొని సిరిమల్ల చెన్నమల్లు ఏర్పాటు చేసిన మాహా అన్నదాన కార్యక్రమానానికి హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి హాజారైనారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేసారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, డివిజన్ అద్యక్షుడు ఓరుగంటి పూర్ణ, మాజీ కార్పోరేటర్ బుద్ధా జగన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, జిల్లా NSUI అద్యక్షుడు పల్లకొండ సతీష్, సయ్యద్ రఫీక్, జి మహేష్, సౌరం కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.