అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫామ్‌ల పంపిణీ
- అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫామ్‌ల పంపిణీ
తెలుగు గళం న్యూస్ ఆత్మకూరు/ జూన్ 2
ఆత్మకూరు మండలం హౌజ్ బుజుర్గు గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సయ్యద్ మౌలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గ్రామ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సయ్యద్ మౌలా మాట్లాడుతూ… దశాబ్దాల పోరాటాలు, ఎందరో అమరవీరుల బలిదానాల ఫలితంగానే స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని గుర్తుచేశారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు, గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు సర్పంచ్ సయ్యద్ మౌలా చేతుల మీదుగా ఉచిత యూనిఫామ్‌లను అందజేశారు. చిన్నతనం నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, విద్యా విలువలను పెంపొందించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అమిత రెడ్డి ఉప సర్పంచ్ బొడుగే లక్ష్మీ రాంబాబు,స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రమ , అంగన్వాడి టీచర్ రమాదేవి, వార్డు సభ్యులు నేరెళ్ల రాజు, పెండేల కర్ణాకర్, కరీంబి, సయ్యద్ గోరేబి, ఎస్కే కమల్, సలీం పాషా, అల్లం యుగేందర్ మరియు ఆశా వర్కర్ మంగళపల్లి రేణుక, మహిళా సంఘం సీఈఓ భాగ్య ,
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ షరీఫ్, ఇందిరమ్మ కమిటీ మెంబెర్లు దామెర రాజు, బొల్లపెల్లి సురేష్, గ్రామ డీలర్ కరీం,గ్రమ పెద్దలు బషీర్, హుస్సేన్ బొబ్బిలి,గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.