•ప్రత్యేక గ్రామ సభలో పర్యావరణ పరిరక్షణపై సర్పంచ్ సయ్యద్ మౌలా పిలుపు
•ప్రత్యేక గ్రామ సభలో పర్యావరణ పరిరక్షణపై సర్పంచ్ సయ్యద్ మౌలా పిలుపు
•వ్యర్థాల వర్గీకరణపై ప్రజలకు విస్తృత అవగాహన
తెలుగు గళం న్యూస్ ఆత్మకూరు /జూన్ 05:
ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, పరిశుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని హౌస్ బుజుర్గ్ గ్రామ సర్పంచ్ సయ్యద్ మౌలా పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం హౌస్ బుజుర్గ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సయ్యద్ మౌలా అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభను అత్యంత వైభవంగా నిర్వహించారు.
పచ్చదనం-పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
ఈ సందర్భంగా సర్పంచ్ సయ్యద్ మౌలా మాట్లాడుతూ, గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు పంచాయతీ పాలకమండలి నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.పర్యావరణ పరిరక్షణ కేవలం మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా, రోజువారీ వ్యర్థాల నిర్వహణలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో భాగంగా గ్రామ ప్రజలకు చెత్త వర్గీకరణపై ఆయన ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఇండ్ల నుండి వెలువడే తడి చెత్త, పొడి చెత్త, శానిటేషన్ వ్యర్థాలను వేర్వేరుగా ఉంచాలని, అలాగే పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన ప్రత్యేక జాగ్రత్త చెత్త విషయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామ సభ అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు అధికారులు కలిసి పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారుఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అమిత రెడ్డి, ఉప సర్పంచ్ బొడిగే లక్ష్మీ రాంబాబు, వార్డు సభ్యులు రాజు, కర్ణాకర్, కరీంబీ మౌలానా, గోరీబీ హుస్సేన్, కమాల్, సలీం పాషా, యుగంధర్, ఆశా వర్కర్ మంగళంపల్లి రేణుక, మహిళా సంఘాల సి.ఏ భాగ్య, గ్రామ కార్యకర్తలు మరియు పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.