అంతర్జాతీయ తెలుగు మహాసభల గోడపత్రికను ఆవిష్కరణ
Bhadradri Kothagudemఅంతర్జాతీయ తెలుగు మహాసభల గోడపత్రికను ఆవిష్కరించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈఓ శ్రీమతి రమాదేవి
2024 జనవరి 5,6,7 ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల గోడపత్రికను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈఓ శ్రీమతి రమాదేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలుగు మహాసభల నిర్వాహకులకు ఈఓ శ్రీమతి రమాదేవి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంతర్జాతీయ తెలుగు మహాసభల సంచాలకులు,గజల్ కవి రాజేష్ మాట్లాడుతూ తెలుగు భాషా వైభవాన్ని, తెలుగు జాతి సంస్కృతీ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటే విధంగా మూడు రోజుల పాటు జరిగే మహాసభలను ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఈ సభలలో ప్రముఖ గజల్ గాయకులు శ్రీ గజల్ శ్రీనివాస్ నిర్వహణలో వివిధ సాహితీ ప్రక్రియలపై సదస్సులు, కవిసమ్మేళనం, కథా పఠనం, సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు వంటి అనేక కార్యక్రమాలు వుంటాయని, సుమారు 70 దేశాల నుండి ప్రతినిధులు, లక్షలమంది సాహితీ ప్రియులు పాల్గొంటారని, నాలుగు రాష్ట్రాల గవర్నర్లను, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను,మంత్రులను, పీఠాధిపతులను , సాహితీవేత్తలను ఆహ్వానించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీ వి.రవీంద్ర, వేదపండితులు శ్రీ కృష్ణమాచార్యులు, ప్రముఖ కవయిత్రులు కె.కనకదుర్గ, ఎం.పద్మావతి, గాయని వాణి తదితరులు పాల్గొన్నారు.