gandra photos local news telugu galam e69news mp elections

రైతుల కొరకు వేసిన రోడ్లపై రాజకీయ కక్ష్య సాధింపు చర్యలు చేపట్టడం సిగ్గు చేటు

అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి … మాజీ ఎమ్మెల్యే గండ్ర
గళం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి,ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ…భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబును నిన్న రాత్రి హన్మకొండలో అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది..
ఈ అరెస్ట్ పై ఎస్పీ, డీఎస్పీ గార్లను వివరణ కోరగా ఒక్క ల్యాండ్ విషయం పై విచారణ కొరకు అరెస్ట్ చేసినం అని చెప్పారు.నేను ఆ కేసు ఏంటా అని పూర్వపరాలు వెలికి తీస్తే 2021 వ సంవత్సరంలో అనిల్ కుమార్ యాదవ్ అనే అతను కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్తున్నారు.
అసలు విషయం ఏంటి అంటే కాసీంపల్లి గ్రామ రైతులు వాళ్ళ పొలాల వద్దకు వెళ్ళాలి అంటే మోకాలి లోతు బురదలో నానా ఇబ్బందులు పడుతూ పంట పొలాలకు వెళ్తున్నాం మాకు పంట పొలాలకు వెళ్లేందుకు రోడ్డు కావాలని కోరితే అందుకు స్పందించిన ప్రభుత్వం రైతుల మాట ప్రకారం వారి పొలాల్లో కొంత మేర నష్టం జరుతది అని తెలిసి,వాళ్ళ ఒప్పందం ప్రకారమే కాసీంపల్లి నుండి కుర్తి ఒర్రె వరకు 15 లక్షల రూపాయలను డి ఎం ఎఫ్ టి నిధుల నుండి మంజూరు చేయించి, టెండర్ పిలవగా నంగావత్ సంధ్య పేరున టెండర్ రాగ పనులు ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది.అదే విధముగా టి యూ ఎఫ్ ఐ డి సి నిధుల నుండి 25 లక్షలు మంజూరు చేసి కుర్తి ఒర్రె నుండి తుండ్ల రోడ్డు వరకు రోడ్డు వేయడం జరిగింది. ఇది కూడా టెండర్ ప్రక్రియ ద్వారా సమ్మయ్య అండ్ కో పాపయ్య పని పూర్తి చేయడం జరిగింది.
ఇది ఒక్క వ్యక్తి కొరకు వేసినది కాదు.ఇది అభివృద్ధిలో భాగంగా రైతుల డిమాండ్ మేరకు వేసిన రోడ్డు.ఇది జరిగింది కూడా 2/06/2021 న అంటే ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అయింది.
అప్పుడు జరిగిన విషయం పై నిన్న కేసు పెట్టడం ఈ రోజు అరెస్టు చేయడం జరిగింది.అసలు ఈ కేసులో బేస్ లేదు అని అన్నారు.
స్థానిక కౌన్సిలర్ గా ఉన్న హరిబాబును రైతులు రోడ్డు కావాలని కోరగా అక్కడ రోడ్డు పెట్టి ఉండవచ్చు…ఇక్కడ సంబంధం లేని విషయంలో A1 గా హరిబాబు ను,A2 గా హరిబాబు తమ్ముడు దశరథంను పెట్టి కేసులు బనాయించి అరెస్టు చేశారు.
నేను అధికారులను ఒక్కటే అడుగుతున్న …గత మూడేళ్లుగా ఇక్కడ అధికారులు లేరా, మూడేళ్ల కింద హరిబాబు చెట్లు తీసేసిన ఇంకా అని ఉంటే ఏమైనా చేసిన అప్పటి నుండి ఏమి చేశారు.
అంటే హరిబాబు ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలని ఉదేశ్యం తో పని చేస్తున్నారు…
గత నెల రోజుల ముందు కూడా ఇలానే అరెస్టు చేసే ప్రయత్నం జరిగింది.బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తల పై కేసులు బనాయించి అరెస్టు చేసి ఈ ఎన్నికల సమయంలో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఈ రోజు కుట్రపూరితంగా అరెస్టు చేయడం జరిగింది.
ఇట్టి అరెస్టును మేము ఖండిస్తున్నాం అని అన్నారు.3 సంవత్సరాల క్రితం రోడ్డు వేస్తే ఇప్పుడు చర్యలు తీసుకోవడం ఏంటి అని అధికారులను ఎద్దేవా చేశారు.
కాబట్టి మీ ద్వారా పోలీస్ యంత్రంగంను కోరుతున్న ఇలాంటి భయబ్రాంతులకు గురిచేసే ఘటనలు జరగకుండా చూడాలని పోలీస్ అధికారులను కోరుతున్నాను.పోలీసులంటే ప్రజలకు ఒక్క విశ్వాసం కలిగి ఉండాలి.ఈ అరెస్టు పై సమగ్ర విచారణ జరపాలని నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్న.ఎస్పీ, డీఎస్పీ గార్లు అక్కడికి వెళ్ళి చూడాలని కోరుతున్నాను.ఈ రోజు హరిబాబు అరెస్టు విషయంలో చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు..మరి ఇంకో కేసు గణపురం మండలంలో ఒక్క లారీని దుబ్బపల్లి గ్రామంలో కొంతమంది తీసుకెళ్ళి తమ ఆధీనంలో పెట్టుకోగా కేసు పెట్టిన పోలీస్ అధికారులు మీరు మీరు మాట్లాడుకోండి అని అన్నట్లే మీరు కూడా మాట్లాడు కొండి అని చెప్పొచ్చు..అంటే చట్టం ఒక్కరికీ ఒక్కలా,ఇంకొక్కరికి ఒక్కల ఉండకూడదు…అదే విషయంలో కూడా త్వరగా రియాక్ట్ కావాలని డిమాండ్ చేశారు.కాబట్టి పోలీస్ అధికారులు రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలని కోరారు.మేము అధికారంలో ఉన్నపుడు ఇలాంటి దుర్మార్గమైన చర్యలు చేపట్టలేదు అని అన్నారు.అదే విధంగా ఈ అక్రమ అరెస్టుపై సమగ్ర విచారణ చేపట్టి ఈ తప్పుడు కేసును విత్ డ్రా చేయాలని డిమాండ్ చేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News