కాశీబుగ్గలో విషాదం
కాశీబుగ్గలో విషాదం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తెలుగు గళం న్యూస్ వరంగల్, జూన్ 5
వరంగల్ కాశీబుగ్గ పద్మానగర్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ తోరెట్టి రామారావు (56) ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 1990 బ్యాచ్‌కు చెందిన రామారావు ప్రస్తుతం సంగెం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.గతంలో వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కూడా విధులు నిర్వర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామారావు శుక్రవారం పద్మానగర్, కాశీబుగ్గలోని తన స్వగృహంలో సీలింగ్ ఫ్యాన్‌కు టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.మృతుడి భార్య తోరెట్టి రజిత దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.రామారావుకు 1995లో వివాహం కాగా, ఇద్దరు కుమారులు వినీత్ రాజ్, సిద్ధార్థ్ రాజ్ ఉన్నారు.ఆయన మృతి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, సహచర పోలీసు సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ ఘటనపై ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ సందీప్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.