డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం కలెక్టర్ ఆఫీస్ లో నేరుగా దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు పరిశీలించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆగస్టు 8న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయండి సిపిఎం జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో రహమత్ నగర్ డివిజన్ ఎస్పిఆర్ హిల్స్ రెండు బొమ్మల వద్ద ధర్నా కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇండ్లు లేని పేదలు వేలాదిమంది హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసులో మరియు ఖైరతాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారు వాటిని ఇప్పటివరకు అధికారులు పరిశీలించలేదు కావున వెంటనే పరిశీలించి అర్హులకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఎనిమిదో తేదీ మంగళవారం రోజున హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ లకిడికపూల్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది వేలాదిమంది వచ్చి ఈ ధర్నాను జయప్రదం చేయాల్సిందిగా సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ జోన్ నాయకులు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నాయకులు రాపర్తి అశోక్, టి సాయి శేషగిరిరావు, జె స్వామి ,జి బిక్షపతి ,సోమేష్ ,భాగ్యరాజు ,లక్ష్మయ్య, దేవదాసు ,మైపాల్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు