
ఇటార్షిలో ధోబిని కలిసిన గోపి రజక
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇటార్షి నగరంలో శ్యామ్ కుమార్ మాల్విని కలిసిన తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక .శ్యామ్ కుమార్ మాల్వి మాట్లాడుతూ ఒకే రజక కులానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రెండు రిజర్వేషన్లు ఉండటం చాలా విచారకరమన్నారు. ఒకే దేశం ఒకే కులం ఒకే రిజర్వేషన్ ఉండాలని వారన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మూడు జిల్లాలు ఎస్టీలుగా కొనసాగడం వలన ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వారు ముందు ఉండడం మిగతా జిల్లాల్లో ఓబీసీలుగా ఉండటం వలన అన్ని రంగాల్లో మేము వెనుకబడటమే కాకుండా మేము మా పిల్లలు కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేజీ బొగ్గుల ధర 50 రూపాయలు ఒక డ్రెస్సు ఐరన్ చేసి ఇస్తే 15 రూపాయలు ఉండడం వలన మాకు గిట్టుబాటు కావడం లేదని తన ఆవేదనను వ్యక్తం చేశారు. 12 రాష్ట్రాల్లోని రజకులు ఓబీసీలుగా ఉండటం అందరి పరిస్థితి ఇదేవిధంగా ఉందని కావున జాతీయ నాయకులు దీనిపై దృష్టి పెట్టి రజక కులాన్ని ఎస్సీ జాబితాలోకి చేర్చే విధంగా పోరాటాలు చేయాలని అందులో వృత్తిదారులు కూడా భాగస్వాములు అవుతామని వారన్నారు.