ఈత పోటీలలో ఖమ్మం వాసికి ద్వితీయ బహుమతి
ఆదివారం విజయవాడలో జరిగిన కృష్ణా రివర్ క్రాసింగ్ 1.5 కిలోమీటర్ల ఈత పోటీల్లో ఖమ్మం నుండి ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ నుండి మొత్తం 22 మంది స్విమ్మర్లు పాల్గొనగా 71 ఏళ్ల పైబడిన వయస్సు కేటగిరీలో ఖమ్మం పట్టణానికి చెందిన సీనియర్ స్విమ్మర్ బోడేపూడి నాగేశ్వరరావు ద్వితీయ బహుమతి సాధించినట్లు ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోదాటి గిరి నేడొక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కోదాటి గిరి మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల నుండి మొత్తం ఆరు వందల యాభై మంది స్విమ్మర్లు వయస్సు ఆధారంగా ఎనిమిది కేటగిరీలో విజయవాడ కు చెందిన ఆక్వా డెవిల్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ వారునిర్వహించిన ఈత పోటీల్లో పాల్గొనడం జరిగింది అని ఖమ్మం నుండి మొత్తం 22 మంది స్విమ్మర్లు తమ అసోసియేషన్ నుండి పాల్గొన్నారు అని పేర్కొన్నారు.పదేళ్ళ చిన్నారుల నుండి డెభై ఐదేళ్ల వయో వృద్దులు సైతం వయస్సును లెక్క చేయకుండా ఈత పోటీల్లో పాల్గొని అధ్బుత ప్రదర్శన చేసారని వారందరికీ తమ అసోసియేషన్ తరపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నామని అన్నారు.విజయవాడలో నిర్వహించిన ఈత పోటీల్లో తనతో పాటు అసోసియేషన్ కార్యదర్శి మందపల్లి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు తూము శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చాపలమడుగు నర్సింహారావు,ఎక్సిక్యూటివ్ సభ్యులు సుబ్రహ్మణ్యం శర్మ, గోవింద్ దారక్, ప్రవీణ్ కుమార్, తిరుపతయ్య,నల్లు వెంకట్ రెడ్డి, తాళ్లూరి శ్రీనివాసరావు, చిన్నారులు మోక్షజ్ఞ, భగత్ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.