ఈర్ల రమేష్ కుటుంబానికి పరామర్శ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది.ఇటీవల ఈర్ల రమేష్ గారి కుమారుడు వినయ్ అనారోగ్య కారణాలతో మరణించడం పట్ల స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో గోరికొత్తపల్లి ఉప సర్పంచ్ సూదబోయిన రవి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ల సంఘం నాయకులు ఈర్ల రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు, వారి ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొట్ల కార్తీక్, రాష్ట్ర అధికార ప్రతినిధి మామిడి కవిత శ్రీకాంత్,భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు గట్టు ప్రదీప్ గౌడ్,గోరికొత్తపల్లి మండల అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్,ప్రధాన కార్యదర్శి మేకల సాంబయ్య, కమిటీ సభ్యులు వనపర్తి శ్రీనివాస్, తోట సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించడానికి ఎప్పటికప్పుడు ముందుంటామని తెలిపారు.