ఉపాధి హామీ నిధుల్లో వివక్షపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం
బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలిచిన గ్రామాలకు (ఈజిస్) నిధులను నిలిపివేయడాన్ని ఖండిస్తు.
ఉపాధి హామీ పనుల నిధుల కేటాయింపులో వివక్ష చూపడం అనైతికం అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సర్పంచులు మరియు ప్రజలు కష్టపడి ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలోని లేబర్ కాంపోనెంట్ ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం మెటీరియల్ కాంపోనెంట్ పైన వచ్చే అభివృద్ధి నిధులను కేవలం కాంగ్రెస్ పార్టీ సర్పంచ లు గెలిచిన గ్రామాలకు కేటాయించడాన్నీ వివక్షతగా భావిస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో పనులలో గ్రామ సర్పంచ్ లు ప్రజలలో మమేకమవుతూ గ్రామ ప్రజలతో కలిసి పనులు చేస్తే బిఆర్ఎస్ పార్టీ గ్రామ సర్పంచులు గెలిచిన చోట వచ్చిన నిధులను పక్క గ్రామాలకు మళ్లించడం ఎంతవరకు న్యాయమో చెప్పాలి. ఉపాధి హామీ పనుల్లో గ్రామాల వారిగా గ్రామస్తులు పడిన కష్టాన్ని స్థానిక ఎమ్మెల్యే డివిజన్ యూనిట్ గా మార్చి గ్రామాల అభివృద్ధికి గండికోడుతూ అధికార పార్టీ,కాంగ్రెస్ సర్పంచులు గెలిచిన వారికే కేటాయించడం ద్వారా ఎమ్మెల్యే చూపుతున్న వివక్షత స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఎన్నడు లేని విధంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నది.గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని అధికార పార్టీ నాయకుల చేతుల్లోకి తీసుకుంటే అధికారులు వంత పాడడం సిగ్గుచేటు. అధికారులు ఈ వివక్షతకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ ( ఈజీఎస్ ) అధికారులు వెంటనే స్పందించి అన్ని గ్రామాలకు సమన్యాయంగా నిధులు కేటాయించి అభివృద్ధికి దోహదపడాలని కోరారు.