ఉపాధి హామీ పనులు పరిశీలించిన డి ఆర్ డి ఓ నాగ పద్మజ
పర్వతగిరి గ్రామంలో రూర్బన్ పథకంలో నిర్మించిన కన్వెన్షన్ హాల్ ను డి ఆర్ డి ఓ నాగ పద్మజ,పరిశీలించారు.అనంతరం ఉపాధి హామీ పథకంలో భాగంగా రోడ్డు పనిచేస్తున్న కూలీల హాజరును పరిశీలించి ఎక్కువ మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.అలాగే అన్ని గ్రామాల్లో పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు త్రాగునీరు,నీడ,మెడికల్ కిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి సర్పంచ్ శంకర్ , రూర్బన్ డి ఈ,రఘు వంశీ,ఏపీవో సుశీల్, ఈసీ రాజు,టి ఏ సురేష్,రాజేష్,ఫీల్డ్ అసిస్టెంట్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.