ఎన్నికల స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ను పరిశీలించిన డీసీపీ
స్థానిక ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, స్టేషన్ ఘనపూర్ ఏసీపీ బీంశర్మ కలిసి పల్లగుట్టలో ఏర్పాటు చేసిన ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ సెంటర్ను సందర్శించారు.ఈ సందర్భంగా అక్కడ అమలులో ఉన్న భద్రతా చర్యలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసు బందోబస్తు, సిబ్బంది విధులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు డీసీపీ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రత కొనసాగించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.