కొమ్మల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
వరంగల్ జిల్లా కొమ్మల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆయనతో పాటు జీవన శ్రీ, పోరిక వనిత రవినాథ్, ధరణి, భూక్య సరిత విక్రమ్ సింగ్, భూక్య మౌనిక (మంగ) మురళి నాయక్, చైతన్య రాథోడ్, జరుపుల రాధిక బాలు నాయక్, నునావత్ మానస రవి నాయక్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో భాగస్వాములయ్యారు.పూజా కార్యక్రమం అనంతరం లావుడియా పల్లవి రాజు నాయక్ మాట్లాడుతూ, ఈ పుణ్యక్షేత్రంలో నిర్వహించిన పూజా కార్యక్రమం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన దేవాలయ నిర్వాహకులు,పూజారులు, గ్రామ సర్పంచ్ బానోతు రఘువీర్, కు రేవంత్ తదితరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందుతూ కుటుంబ సౌఖ్యం,ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.మొత్తం కార్యక్రమం భక్తి పరవశంలో సాగి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది.