కౌంటింగ్ సిబ్బంది శిక్షణ తరగతులకు తప్పనిసరి
పారదర్శకంగా కౌంటింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ
భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు నియమితులైన కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.కౌంటింగ్ విధులకు నియమించబడిన సిబ్బందిని వారి సంబంధిత శాఖల అధికారులు రెండు రోజులపాటు సాధారణ విధుల నుండి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు కీలక దశ కావడంతో సిబ్బంది పూర్తి అవగాహనతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.కౌంటింగ్ శిక్షణ తరగతులు ఫిబ్రవరి 12, 2026 తేదీన ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలోని మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడతాయని తెలిపారు. నియమితులైన సిబ్బంది అందరూ సమయానికి హాజరై శిక్షణలో పాల్గొని కౌంటింగ్ విధానాలు, నిబంధనలు,జాగ్రత్తలు తదితర అంశాలపై పూర్తి అవగాహన పొందాలని సూచించారు.అలాగే, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13, 2026 తేదీన ఉదయం 7:00 గంటలకు అదే ప్రాంగణంలో ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరై తమ బాధ్యతలను క్రమశిక్షణతో, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమని, అధికారుల సమన్వయం మరియు సిబ్బంది కట్టుబాటు ఎంతో అవసరమని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పేర్కొన్నారు.