భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ఉదయం సమయంలో DSP భద్రాచలం ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ SI పి.శ్యాం ప్రసాద్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటుగా భద్రాచలం గోదావరి కరకట్ట, రెడ్డి సత్రం సమీప ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించుచుండగా, ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు: వాడపర్తి సురేష్ మరియు షేక్ షఫీర్ పాషా @ సప్పు అని తెలిపినారు. ఇరు ఇద్దరు కూడా భద్రాచలంకు చెందినవారే. వీరు ఇద్దరు గత కొంత కాలంగా గుర్తు తెలియని వ్యక్తుల నుండి గంజాయిని కొని భద్రాచలంలో మరియు భద్రాచలం చుట్టూ ప్రక్కల వారికీ గంజాయిని చిన్న చిన్న ప్యాకేట్లుగా చేసి లాభం పొందుతూ ఉండేవారు. వారిద్దరి వద్ద నుండి స్వాదినం చేసుకున్న సుమారు ఒక కేజీ బరువు గల గంజాయి 45,000/- రూపాయల విలువ కలదు. వారిద్దరి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ ను మరియు 2 మొబైల్ ఫోన్ లను స్వాదీన పరుచుకుని సీజ్ చేసి, పట్టుబడిన ఇద్దరు మగ వ్యక్తులను అదుపులోకి తీసుకొనగా, భద్రాచలం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ బి.రామకృష్ణ కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం జైలుకు పంపడం జరిగింది. ఈ మద్య కాలంలో భద్రాచలం ప్రాంతానికి చెందిన వారె ఎక్కువగా గంజాయిని త్రాగడం కాని, గంజాయి రవాణా చేయడం కాని జరుగుతుందని కావున తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని హెచ్చరించారు. ఈ సందర్బంగా భద్రాచలం DSP ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేసే వారిపై మరియు గంజాయి త్రాగేవాల్లపై మరియు గంజాయి అక్రమ రవాణాకు సహాయం చేసిన వారిపై చట్టపరమయిన చర్యలు తీసుకుంటామని మరియు గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా, నిల్వ గురించి సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించగలరని, సమాచారం ఇచ్చిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని భద్రాచలం డి ఎస్ పి తెలిపినారు.