జనగణన విజవంతానికి ప్రతి ఒక్కరు సహకరించాలి
గృహ గణన విధానం అత్యంత కీలకం-
సోమారం & జామల పురం లో గృహ గణన ఏనుమరేషన్ పరిశీలనచేసిన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం జమాల్ పురం గ్రామాల్లో నిర్వహించే సెన్సెస్ 2027 గృహ గణన జనగణన ప్రక్రియలో స్వీయ గణన విధానం అత్యంత కీలకమని, ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను సరైన విధంగా ఇంటికి వచ్చే ఏనుమరేషన్ తో చేసుకోవడం ద్వారా ఖచ్చితమైన గణాంకాలు సేకరించబడతాయని ,
ప్రతి కుటుంబం జనగణన సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. ఖచ్చితమైన సమాచారం అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని
పర్వతగిరి తహసీల్దార్ వెంకటస్వామి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ప్రతి పౌరుడి పై ఉందని ఆయన పేర్కొన్నారు. గృహ గణనపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.