జనతా ట్రస్ట్ మిత్ర బృందం గ్రంథాలయానికి చేయూత
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్ ,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ నకిరెడ్డి మహేందర్ ఐనవోలు శివరాం అందించటం జరిగినది.
ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గూడూరు సందీప్,దుంకదువ్వ రంజిత్,తనుగుల అంబేద్కర్,అచ్చ దయాకర్,కొంకిస విఘ్నేష్,ఠాకూర్ విజయ్ సింగ్,కాసుల నాగేంద్ర బాబు,రవీంద్ర చారి,బానోత్ రాజేందర్,సామల ప్రవీణ్ మరియు తదితరులు పాల్గొన్నారు.