ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు ముందడుగు
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో విధుల్లో నిత్యం ఎండలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ట్రాఫిక్ సిబ్బందికి చలువ కళ్లద్దాలు అందజేసి వారి సేవలను అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ఎండను లెక్కచేయకుండా ప్రజల భద్రత కోసం రహదారులపై నిరంతరం సేవలందిస్తున్నారని కొనియాడారు.అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా తరచూ నీరు, ద్రవాలు తీసుకోవడం ద్వారా శరీరంలో నీరసం రాకుండా చూసుకోవాలని తెలిపారు.ప్రజల సురక్షిత ప్రయాణానికి కీలకంగా పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఎస్పీ స్పష్టం చేశారు.విధుల్లో ఉన్న సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ పోలీసుల్లో ఉత్సాహం పెరిగిందని, ఇలాంటి చర్యలు తమకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని సిబ్బంది తెలిపారు.