మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పది(10) సంవత్సరాలు అవుతున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. అయితే నీళ్లతో ఒకే ఒక కుటుంబ బంధుమిత్రులు బాగుపడ్డారు. ఇక నిధుల పేరుతో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం అప్పుల పాలు అయింది. ఇకపోతే నియామకాలు, నియామకాల విషయానికొస్తే ప్రస్తుత అధికార పార్టీ నిరుద్యోగులను మోసం చేయడమే కాక, వంచనకు గురి చేసిందని చెప్పుకోవాలి. గడిచిన 10 సంవత్సరాలలో 10,000 విద్యాసంస్థలను ప్రభుత్వము రద్దు చేసింది. ప్రభుత్వ సంస్థలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆశలకు గండి కొట్టి, నిరుద్యోగులను బలి పశువులను చేసింది. ఇంటికో ఉద్యోగం, పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, తెలంగాణ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా బ్రతుకొచ్చు అని కల్లబొల్లి కబుర్లతో, మాయ మాటలు చెప్పి, వచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిందని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ నిర్మోహమాటంగా ప్రజల తరఫున చెప్తున్నది. కావున ప్రజలారా!. మనం బాగుపడాలంటే, తప్పనిసరిగా "పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ"ని ఆదరించి, అభిమానించి గెలిపించుకుంటే మనందరం సుఖంగా సంతోషంగా ఉండగలమని, మన బ్రతుకులను మనమే బాగు చేసుకోవచ్చని, పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ కోరుతుంది అని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు