దళిత రత్న అవార్డు గ్రహీత కంతి ప్రవీణ్‌కు ఘన సన్మానం
నర్మేట మండలం కన్నెబోయిన గూడెం గ్రామానికి చెందిన దళిత రత్న అవార్డు గ్రహీత కంతి ప్రవీణ్‌ను ఆదివారం గ్రామంలో ఘనంగా సన్మానించారు. హంసాత్ ఫౌండేషన్ చైర్మన్ మహమ్మద్ యాకుబ్ పాషా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత ప్రతిభతో గుర్తింపు తెచ్చుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.