


ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్ మే20
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కూలీలకు గ్రామ సర్పంచ్ రమాదేవి – రఘోత్తం రెడ్డి ఆధ్వర్యంలో రెండు వందల మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో కూలీలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు చల్లని మజ్జిగ అందించి వారి దాహార్తిని తీర్చడంతో పాటు వేసవి వేడిమి నుంచి ఉపశమనం కల్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ, కూలీల ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, ఉపాధి హామీ కూలీలు సర్పంచ్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గొట్టం రవి వర్మ, వార్డు సభ్యులు గొట్టం రమేష్, లావణ్య, సునీల్ కుమార్, మహాలక్ష్మి, కార్యదర్శి బి. భాస్కర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మునిగాల ప్రభాకర్, ఓరుగంటి యాదగిరి, బైరపాక బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.