నారా చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని మహాయాగం నిర్వహించిన పీజేఆర్.
Andhra Pradesh, Anantapurబాబు పాలనే ధ్యేయంగా మహా చండీ యాగం పీజేఆర్
పామిడి అంతపురం జిల్లా
నారా చంద్రబాబునాయుడు పరిపాలన రావాలని రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనలో ధర్మ పాలన చంద్రబాబు నాయుడు చేపట్టాలని ఈ రాక్షస పాలనకి చరణ గీతం పాడాలని ధ్యేయంతో జులై రెండున ప్రారంభించిన మహా త్యాగం నాలుగు తారీకున గురు పౌర్ణమి సందర్భంగా పెనుగొండ సమీపంలోనీ శ్రీ కైలాష్ గిరి మహా క్షేత్రంలో శ్రీ మహా పశుపతి మహా చండీయాగాన్ని 51 మందికి వివిధ రాష్ట్రాల వేద పండితులతో మహా చండీయాగాన్ని నిర్వహించారు.ఈ మహా యాగంలో వేద పండితుల చే నిర్వహించిన పూజలు అంబరాన్ని అంటాయి. ఈ మాసంలో జరపబోతున్న చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర ఘనంగా సురక్షితంగా జరగాలని అందుకు గల రాక్షసుల అడ్డంకులు తొలగాలని జరగబోయే ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఇంతటి మహా యజ్ఞాన్ని చేపట్టానని గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకుడు పిజేఆర్ సోషల్ సర్వీసెస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పెరుమళ్ళ జీవానంద రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగభాగ్యాలతో ఉండగలిగేటువంటి కుటుంబంలో ఉన్నప్పటికీ తనకున్న ఒక కుమారుడు తెలుగుదేశం పార్టీ కోసం ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం గాలి వాన ఎండలు లెక్కచేయకుండా ఇంత చిన్న వయసులో 4వేల కిలోమీటర్ల యువ గళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు అంటే చంద్రబాబునాయుడు కుటుంబ ఆంధ్ర ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇకపైన ప్రజల్ని మోసగిస్తూ మీరు ప్రతిసారి వత్తే బటన్లు పనిచేయబోవని మీరు ఎంత మభ్యపెట్టిన ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మరని ఆయన అన్నారు ఇక వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ధర్మపరమైన రాజ్యాంగమే వస్తుందని కచ్చితంగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారని జీవానంద రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పెరుమళ్ళ జీవానంద రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ కైలాష్ గిరి పర్వత శ్రీ భ్రమరాంబిక పీఠాధిపతి శ్రీ శ్రీ బ్రహ్మానంద గురువులు , కర్ణాటక కేరళ ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి 51 మంది వేద పండితులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు