
పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ఎ జెండా నీ తెలిపిన పార్టీ అధ్యక్షుడు
పీపుల్ ప్రొటెక్షన్ పార్టీని ప్రజలు అభిమానించి, ఆదరించి రాబోయే సాధారణ ఎన్నికలలో గెలిపించుకుంటే! సమాజంలోని ప్రజలందరూ ఒక కుటుంబంగా జీవించేందుకు కావలసిన పరిస్థితులను ఇస్తానని చెప్తూ ఈ క్రింది వాటిని నెరవేరుస్తానని “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ” హామీ ఇస్తున్నది.
1). ప్రజలందరికీ అత్యున్నత ప్రమాణాల ఉచిత వైద్యం.
2). విద్యార్థులందరికీ నైతిక విలువలు కలిగిన అత్యున్నత ప్రమాణాల ఉచిత విద్య.
3). అసంఘటిత కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటన.
4). సమాజంలో సగభాగమైన మహిళలు సంస్థలలో, వ్యవస్థలలో సగభాగం ఉండేలా విధివిధానాలు.
5). మనచే, మనకోసం, మనం ఏర్పాటు చేసుకున్న సంస్థలు, వ్యవస్థలు మనకు వినయ విధేయతతో ఉండేలా సంస్కరణలు, శిక్షణలు.
ఇలా ఈ విధంగా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉండే పరిపాలనను అందిస్తానని పీపుల్ ప్రొడక్షన్ పార్టీ చెప్తున్నది. కావున ప్రజలు ఆలోచించి రాబోవు ఎలక్షన్లలో ఒక్క ఛాన్స్ “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ”కి ఇచ్చి గెలిపిస్తారని విశ్వసిస్తూన్నాము అని అన్నారు