పేదరికం, సంప్రదాయాలతో పోరాడండి
- బాల్య వివాహాలకు ముగింపు పలకండి
- లా అండ్ ఆర్డర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రసాదరావు
జీవితంలో స్థిరపడిన తర్వాతనే వివాహం చేసుకోవాలని అందుకు చదువు ఒక్కటే ఏకైక మార్గమని డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) శ్రీ ప్రసాదరావు పేర్కొన్నారు
యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటినరీ కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఎన్ఎస్పి క్యాంపు నందు బాల్ వివాహ ముక్త్ భారత్ రథయాత్ర ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలను నిరోధించడానికి బాల్య వివాహ నిరోధక చట్టం 2006ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని అన్నారు అనాదిగా వస్తున్న ఈ సాంఘిక దురాచారాన్ని ఇకపై సహించవద్దు అని దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. పిల్లలు తల్లిదండ్రులతో నిరంతరం మాట్లాడాలని తమ కళాశాలలో పాఠశాలలో జరిగే అన్ని విషయాల పట్ల తల్లిదండ్రులతోటి చర్చించాలని తెలిపారు తద్వారా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని చదువుకుని స్థిరపడే వరకు వివాహ ఆలోచన రాకుండా ఉండే అవకాశం ఉందని అన్నారు. బాల్య వివాహం చేయడం వలన విద్యకు అంతరయం కలగడం తోపాటు ఆరోగ్య సమస్యలు వస్తాయని శారీరకంగా మానసికంగా సిద్ధంగా లేని వయసులో గర్భధారణ వల్ల ప్రమాదాలు ఎక్కువ అవుతాయని తెలిపారు విద్య లేకపోవడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే మహిళా సాధికారతకు వారి స్వప్నాలు ఆశయాలకు అడ్డంకిగా నిలిచి జీవితాన్ని మధ్యలోనే ముగింపు పలుకుతున్న సందర్భాలను గుర్తు చేశారు
పేదరికం అజ్ఞానం సామాజిక వత్తుడి సాంప్రదాయాలు బాల్యవివాహాలకు కారణాలు అవుతున్నాయని ఆడపిల్లలు భారం కాదని హితవు పలికారు
అందువలన పేదరికం సాంప్రదాయాలతో పోరాడి బాల్యవివాహాలను నిరోధించాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని ఆయన నొక్కి వక్కాణించారు. గత రెండేళ్లుగా ఎయిడ్ సేవా సంస్థ ద్వారా చేస్తున్న వివిధ కార్యక్రమాలు ను ఆయన ప్రశంసించారు ఈ రథయాత్ర ద్వారా ఖమ్మం జిల్లాలోని ప్రతి ఒక్కరికి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించి 2030 లోపే ఖమ్మం జిల్లాలో బాల్యవివాహా రహిత జిల్లాగా మార్చడానికి పోలీసు శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
మరో అతిధి బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి భారతరాణి మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలను నిర్మూలించడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం బాలల సంక్షేమ కమిటీ పోలీసు శాఖ మరియు స్వచ్ఛంద సంస్థల వారి సహాయ సహకారాలతో నిరంతరం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బాల్యవివాహాల నిర్మూలన బాల కార్మిక వ్యవస్థ బాలలపై లైంగిక దాడులు బాలల అక్రమ రవాణా తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ విద్యను ప్రోత్సహించడం ద్వారా బాలల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. బాలికలు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తల్లిదండ్రులకు చదువుకున్న కళాశాలకు పేరు తీసుకువచ్చి దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు బాలల సమస్యలను చైల్డ్ లైన్టర్ అయినట్టుగా ఫోన్ చేసి తెలపాలని అన్నారు
యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరి ప్రసాదరావు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మరియు సూర్యపేట జిల్లాలలో తమ సంస్థ ద్వారా బాల్యవివాహాల నిర్మూలనకు నిరంతరం వివిధ శాఖల సహాయ సహకారాలతో అవగాహన కార్యక్రమాలు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ నందు కీలక పాత్ర పోషిస్తున్నామని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి 50 మంది ఆడపిల్లలు ఒకరికి బాల్య వివాహం జరుగుతుందని 2030 లోపు బాల్యవివాహాలను 10 శాతం లోపు తగ్గించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రథయాత్ర ఈరోజు నుంచి జిల్లాలో ఉన్న 21 మండలాలలో ప్రచారం చేస్తుందని అవగాహన ద్వారానే బాల్యవివాహాలను నిర్మూలించవచ్చని తల్లిదండ్రులు ప్రజలు అధికారులు సహకరిస్తే త్వరలోనే మనం బాల్య వివాహరహిత ఖమ్మం జిల్లాను చూడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు
అనంతరం ముఖ్య అతిథి శ్రీ ప్రసాదరావు డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ వారి చేతులమీదుగా రథయాత్రను ప్రారంభించడం జరిగింది. అలాగే బాల్య వివాహాల నిర్మూలన కొరకై ప్రచారానికి కరపత్రాలను కూడా విడుదల చేయడం జరిగింది
ఈ కార్యక్రమం నందు ఎయిడ్ సంస్థ డైరెక్టర్ పి ఎస్ ఎస్ హరి ప్రసాదరావు , శ్రీమతి వాణి, కోఆర్డినేటర్లు కే శ్రీనివాస్ వి రాజేష్ కళాశాల ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ సత్య స్వరూపిణి,టీం సభ్యులు రాందాస్ రవిచంద్ర రవీంద్ర భాస్కర్ , కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు