పొంగులేటి కార్యాలయంలో ఆశాల వినతి
పొంగులేటి కార్యాలయంలో ఆశాల వినతి
ఆషా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మంజిల్లా పాలేరు నియోజకవర్గ యంయల్ఏ, రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు ఆఫీసు ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కి ఖమ్మం రూరల్ మండలo, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన ఆషా వర్కర్స్ సోమవారం సిఐటియు నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆషా వర్కర్స్ కు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఫిక్స్డు వేతనాలు 18000 వేలు ఇవ్వాలని పీయఫ్ ఇయస్ఐ ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని భర్త చనిపోయిన ఆషా వర్కర్స్ కు వికలాంగులైన వారికి వంటరి మహిళలు కు పించన్లు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి దృష్టి కి తీసుకోచ్చారు , అర్హులైన వారందరికీసెకండ్ ఎ యన్ యం ప్రమోషన్స్ కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా సమస్యలు అన్ని మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి కి తీసుకవెళతానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మ విష్ణు వర్ధన్, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పిన్నింటి రమ్య ఆషా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రమణ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పెరుమాళ్ళ పల్లి మోహన్ రావు , జిల్లా సహాయ కార్యదర్శి నవీన్ రెడ్డి జిల్లా నాయకులు వశపోంగు వీరన్న రూరల్ మండల కార్యదర్శి బి జ్యోతి సుభద్ర ఉమా నాగమణి జ్యోతి మంజుల ఉప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.