పొంగులేటి శీనన్నకు సాయం చేయడమే తెలుసు
పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం సీఎం కేసీఆర్ కి మింగుడు పడట్లేదు.
పొంగులేటి తో కాంగ్రెస్ లో చేరిన అనుచరులను సీఎం కేసీఆర్ నయానో భయానో బెదిరించి,ప్రలోభ పెట్టి కుట్రలు పన్నుతుండు. సీఎం కేసీఆర్ కుట్రల ఉచ్చులో పొంగులేటి అనుచరులైన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు పడరు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులందరికీ పొంగిలేటి శీనన్న ఆశీస్సులు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ గా ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు శీనన్న నాయకత్వంలో బట్టి,రేణుక, సంబానీల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. టికెట్ దక్కుతుందో లేదో అనే అభద్రతాభావంతో పొంగులేటి శీనన్న పై సొంత పార్టీ నాయకులే తొందరపడి నోరు జారి దిగజారి కేసీఆర్ మాయలో పడకండి. మీ నోటి దురుసును ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై ఎక్కుపెట్టండి. అది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుంది. కెసిఆర్ ఎన్ని వేషాలు వేసినా ప్రజా బలం ఉన్న పొంగిలేటి నాయకత్వాన్ని బలహీన పరచలేడు.