ప్రజాస్వామ్యానికి దారా రమేష్ దంపతుల మద్దతు
కొత్తగూడెం 51వ డివిజన్లో ఓటు హక్కు వినియోగం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 51వ డివిజన్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ధారా రమేష్, సుభాషిణి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్యంపై తమ నిబద్ధతను చాటుకున్నారు.
పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారు క్యూలో నిలబడి ఓటు వేసి, అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమని, ప్రతి పౌరుడు తన హక్కును వినియోగించుకోవడం ద్వారా మంచి పాలనకు దారి తీస్తారని వారు పేర్కొన్నారు.
నగర అభివృద్ధి, పారదర్శక పరిపాలన, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలు ఓటు ద్వారా సాధ్యమవుతాయని ధారా రమేష్ అన్నారు. ఎన్నికలు ప్రజల ఆశయాల ప్రతిబింబమని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 51వ డివిజన్లో పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతుండగా, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించడం ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.