ఫాతిమా షేక్ జయంతి రోజును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి* యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక డిమాండ్
పట్నం రాజేశ్వరి.

ఈ రోజు యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహిళా ఐక్య వేదిక కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలు షేకున్ భాను ఆద్వర్యంలో ఎమ్మిగనూరు జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల నందు చదువుల తల్లి ఫాతిమా షేక్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఫాతిమా షేక్ విగ్రహా దాత నక్కలమిట్ట శ్రీనివాసులు, నంది విజయలక్ష్మీ, మైనార్టీ నాయకులు అన్వర్ హుస్సేన్,ఇస్మాయిల్,ఉపాధ్యాలు ఖాదీరుల్లా,జైబా,రచయిత అజీజ్ , శంషుద్దీన్, అసదుల్లా, కరుణాకర్ ప్రసాద్ మహిళా ఐక్య వేదిక రాయలసీమ డివిజన్ అధ్యక్షురాలు భారతమ్మ మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నక్కలమిట్ట శ్రీనివాసులు మరియు స్కూల్ హెచ్ఎం గారు కోటయ్య ఫాతిమా షేక్ విగ్రహాలను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు ఫాతిమా షేక్ అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. చదువుల తల్లి ఫాతిమా షేక్ జయంతి రోజును అధికారికంగా ప్రకటింఛాలని ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. విగ్రహ దాత నక్కల మిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి ముస్లిమ్ మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందించదగ్గ మంచి కార్యక్రమమని, విద్యార్థులు ఫాతిమా షేక్ ఆలోచనలతో ఆ మహనీయుల అడుగు జాడల్లో నడిచి వారి భవిష్యత్తుని ఉన్నతంగా మార్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రములో స్కూలు ఉపాధ్యాయులు, మరియ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలు హుస్సేన్ బీ,ఎమ్మిగనూరు డివిజన్ అధ్యక్షురాలు ఎలిశమ్మ,మండల అధ్యక్షురాలు ఈరమ్మ , కోడుమూరు మండల అధ్యక్షురాలు దస్తగిరమ్మ,,గోనెగండ్ల మండల అధ్యక్షురాలు ఖాసీం బీ, రేవతి,లక్ష్మీదేవి,తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News