పామిడి అనంతపురం జిల్లా పామిడి TC ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల బదిలీలపై ఇతర పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు మున్వర్ భాష ఎంఈఓ గా పదోన్నతి, బదిలీ పొందిన రామాంజనేయులు , పెద్ద ఆంజనేయులు, శ్రీమతి శాంతకుమారి, శ్రీమతి చండీప్రియ, శ్రీ మాధవరెడ్డి, శ్రీమతి రామాంజినమ్మ, సతీష్, అంజాద్ వలి, రత్నమయ్య గార్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూర్వ విద్యార్థి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.