బొగ్గుగనులలో దేశవ్యాప్త సమ్మె విజయవంతం
సింగరేణిలో మద్దతు తెలిపిన కార్మిక వర్గం సత్తుపల్లి జే.వి.ఆర్ ఓసి , కిష్టారం ఓసి , జే.వి.ఆర్ సి.హెచ్.పి లో సింగరేణి ఉద్యోగులందరూ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మరియు సింగరేణిలో ఉన్న జాతీయ సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా లేబర్ కోడ్ లను రద్దు చేయాలని , తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు బ్లాక్ లను కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి బంగారంగా ఉన్నటువంటి సింగరేణి సంస్థను కాపాడుకోవాలని స్వచ్ఛందంగా ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెతో కేంద్రానికి గుణ పాఠం రావాలని సత్తుపల్లి సింగరేణి ఐక్య కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తీగల క్రాంతికుమార్ , కోటి , సముద్రాల సుధాకర్ , దండు ఆదినారాయణ , ఆంజనేయులు , చంద్రశేఖర్ , సంపత్ , శరత్ అన్నారు.కార్మిక చట్టాలను లేబర్ కోడ్ లు గా మార్చి పాగిశ్రామిక ప్రగతిని దెబ్బతీయడానికి ఉద్యోగుల హక్కులను కాలరాయడానికి కేంద్రం నిర్ణయాలు తీసుకుంటం ఉన్నారు. ఈ లేబర్ కోడ్ ల మూలంగా ఉద్యోగ భద్రత ఉండదని కార్మిక వర్గం కోసం పోరాటం చేసే కార్మిక సంఘాలు లేకుండా పోతాయని బొగ్గు పరిశ్రమలు పూర్తిగా ప్రైవేటు పరం అవుతాయని పేర్కొన్నారు. కార్మిక వర్గానికి నష్టం కలిగే విధంగా విచ్చలవిడిగా చట్టాలను తీసుకొచ్చి బొగ్గు పరిశ్రమలు లేకుండా చేయడం సరికాదన్నారు. వంద సంవత్సరాల నాటి చట్టాలను లేబర్ కోడ్ గా మారడం అంటే పూర్తిగా ఉద్యోగుల హక్కులను కాలరాయడమే. సింగరేణి ఉద్యోగుల హక్కులను కాలరాయడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అదాని , అంబానీల కోసం పాటుపడుతున్నారని. వారు మండిపడ్డారు. సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు రామారావు , నాగేశ్వరరావు , బాలాజీ , ఏఐటీయూసీ నాయకులు సూర్య ప్రకాష్ , నరసింహారావు , భరణి , కిషోర్ , ప్రసాద్ , రఘువీర్ , పి.పి రాజు , సంపత్ , కార్తీక్ ఇతర యూనియన్ నాయకులు , కార్యకర్తలు , ఉద్యోగులు పాల్గొన్నారు.