భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలం
తహశీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ముందు ధర్నా చేసి వినతిపత్రాన్ని తహశీల్దార్ వీరభద్రనాయక్ కు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు చలమాల విఠల్ రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వెల్ఫేర్ బోర్డు దరఖాస్తులను తక్షణమే పరిష్కారం చేయాలని, ఇల్లు లేని నిరుపేదలైన భవన నిర్మాణ కార్మికులకు ఇల్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, 55 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు 6000 పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని, గత శాసనసభ సమావేశాల్లో నిర్ణయించిన ప్రకారం భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిల్ ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గాయం తిరపతి రావు, రైతు సంఘం మండలాధ్యక్షుడు చిట్టి మొదల కృష్ణయ్య, సిఐటియు మండల కన్వీనర్ గుడిమెట్ల బాబు, చీపి.వెంకటేశ్వరరావు, చందు, జి.వెంకటేశ్వరావు, చెన్నారావు,గోపి, శీను, తడకమల్ల చిరంజీవి,కంటే సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Good coverage medam garu namaste.