మన ప్రభుత్వ బడి - మన బాధ్యత
తన బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉత్తమ ఉపాధ్యాయునిగా నిలిచిన జుబ్బురూ ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల
అడసర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న టియస్ యుటియఫ్ సీనియర్ కార్యకర్త జుబ్బూరు రాఘవులు తన ఇద్దరు కవల పిల్లలను శ్రీరామ్, రఘురామ్ లను తన పని చేస్తున్న పాఠశాలలో 6 వ తరగతి లో చేర్పించి అందరికీ ఆదర్శప్రాయులుగా నిలిచారు.ఈసందర్భంగా పాఠశాలప్రధానోపాధ్యాయులు శీలం శ్రీనివాసరావు మాట్లాడుతూ రాఘవులు గారు వ్యాయామ ఉపాధ్యాయులుగా విద్యార్థులు అభ్యున్నతి కొరకు నిరంతరం శ్రమిస్తూ ఉంటారని నమోదు పెంచడంతో విశేషమైన కృషి చేశారని, ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం పెంచడానికి తన వంతు కృషిగా తన పిల్లలను తను పని చేస్తున్న పాఠశాలలో చేర్పించడం ద్వారా సమాజంలో ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకాన్ని , భరోసాను కల్పించారని రాఘవులు గారిని వారి సతీమణి శ్రీలక్ష్మి ని ప్రశంసించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో: పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, వెంకట నరసయ్య, కిషోర్, యూనియన్ బాధ్యులు నిర్మల కుమారి, ఈశ్వరాచారి,దీన్ దయాల్ రెడ్డి, యాకూబ్ ఆలి,రామ శేషు తదితరులు పాల్గొన్నారు