మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హన్మకొండ వేయిస్థంబాల గుడిలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా శివరాత్రి హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ, శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి, రోజంతా శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా దేవుణ్ణి ప్రార్థించారు. నాయిని రాజేందర్ రెడ్డి గారు జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ తోట వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అద్యక్షుడు పల్లె రాహుల్ రెడ్డి. తోట పవన్ తదితరులు పాల్గొన్నారు.