station ghanpur news local news eection news telugu galam newsఇండిపెండెంట్ పార్లమెంట్ అభ్యర్థి గాదెపాక అనిల్.

-ఇండిపెండెంట్ పార్లమెంట్ అభ్యర్థి గాదెపాక అనిల్.

తెలుగు గళం స్టేషన్ ఘనపూర్

ఈ రాష్ట్రంలో మాదిగలకు రాజకీయాలలో పోటీ చేసే అర్హత లేదా అని వరంగల్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గాదెపాక అనిల్ కుమార్ సిఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అనీక కాన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ మాట్లాడారు.
ఈ రాష్ట్రంలో 50 లక్షలకు పైగా మాదిగలు ఉంటే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉంది అని మాదిగల ఆస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చంపేసినట్లుగా ఉందన్నారు.మాదిగలకు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కనీసం మూడు సీట్లు అయినా కేటాయించాలి కానీ మాదిగ ఉపకులాలైన మాలలకు ఒక్క శాతం కూడా లేని బైండ్ల కులస్తులకు కేటాయించడం దారుణమని అన్నారు. దీని వివిధ దీనిపైన మాదిగలకు ఇచ్చే గౌరవం ఏంటో అర్థమవుతుందని రాష్ట్రం మొత్తం మీద 1000 ఓట్లు కూడా లేని బైండ్ల కులస్తుడైన కడియం శ్రీహరి కూతురుకు ఏ ప్రాతిపదికన వరంగల్ పార్లమెంటు స్థానం ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. కడియం శ్రీహరి బ్లాక్ మెయిల్ రాజకీయాల ద్వారా గత 40 సంవత్సరాలుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పాగా వేసి మాదిగలను అనగ తొక్కుతూ రాజకీయం చేస్తున్నారని, నాలాంటి చదువుకున్న వ్యక్తులు ఎక్కడ అభివృద్ధి చెంది రాజకీయంగా తనకు పోటీ అవుతారని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ మాదిగలను ఎదగకుండా చేస్తున్నారని అన్నారు.కడియంకు ఏ విధంగా రాజకీయ అవకాశాలు వచ్చాయో, ఏ విధంగా ఆస్తులు వచ్చాయో, దానికి సంబంధించిన ఆధారాలు అన్ని నా దగ్గర ఉన్నాయని అన్నారు. ఇప్పటి నుండి ఎలక్షన్లయ్యే వరకు ఆధారాలు అన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతూ తనను ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ఇదంతా నా స్వార్థం కోసం కాదు మాదిగల అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తున్నాను అన్నారు.నా యొక్క బ్యాట్ గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రశ్నించే గొంతును కాపాడుకోవాలని సూచించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News