హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ కంటెస్టెడ్ సర్పంచ్ మార్నేని లక్ష్మి-లక్ష్మణ్ రావు ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హంటర్ రోడ్‌లోని వారి నివాసంలో లక్ష్మణ్‌ను పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మనోధైర్యంతో ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పోలేపల్లి బుచ్చిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, ఐనవోలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాకర సాంబయ్య, కాంగ్రెస్ నాయకుడు చిలుక రవి తదితరులు పాల్గొన్నారు.